హైద‌రాబాద్‌లో ఘ‌నంగా అలాయ్ బ‌లాయ్ వేడుక‌లు..

హైద‌రాబాద్‌లో గ‌త 13 సంవ‌త్స‌రాలుగా అలాయ్ బ‌లాయ్  కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఈ సారి కూడా ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో అలాయ్ బ‌లాయ్‌ కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రుగుతుంది. ప్ర‌తి ఏట ద‌స‌ర చివ‌రి రోజున ఈ అలాయ్ బ‌లాయ్ కార్యక్ర‌క‌మాన్ని కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ ఘ‌నంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇందులో కులమ‌త‌లాకు అతీతంగా అంద‌రు పాల్గొని ఒక‌రి ఒక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకుంటూ ఆలింగ‌నం చేసుకుంటారు. ఈ ఏడాది కూడా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో 39 నాన్‌వేజ్ వంట‌కాల‌తో అంద‌రిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కేంద్ర మంత్రులు వెంక‌య్య నాయుడు, అనంత కుమార్ పాల్గొన్నారు.